రబీ సీజన్లో వివిధ రకాల పంటలు పండించే ప్రతి ఒక్కరూ ఈ క్రాప్ నమోదు చేయించుకో వాలని రైతులను విసన్నపేట మండల వ్యవసాయ శాఖ అధికారి రాజ్యలక్ష్మి కోరారు. మంగళవారం విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం రైతు సేవ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ట్లుగా తెలిపారు. రైతులు పాసుబుక్కులు, బ్యాంకు, ఆధార్ జిరాక్స్ లు అందించాలని కోరారు.