తిరువూరు నియోజకవర్గంలో ఎటువంటి విభేదాలు, గొడవలు లేవని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సోమవారం అన్నారు. తనని ఎవరూ టార్గెట్ చేయలేదని అన్నారు. చంద్రబాబు పాదయాత్ర సమయంలో కూడా వాటర్ బాటిల్‌తో ఆ కుటుంబం దాడి చేసిందని మీడియాకు తెలిపారు. తర్వాత తిరువూరుకు సంబంధించిన దేవదత్తు, జవహర్‌లపై కూడా దాడికి పాల్పడ్డారని కొలికపూడి శ్రీనివాస్ అన్నారు. నేడు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు.