తిరువూరు: చిన్నకొమిర అంగన్వాడీలో పోషకాహారంపై అవగాహన

64చూసినవారు
తిరువూరు: చిన్నకొమిర అంగన్వాడీలో పోషకాహారంపై అవగాహన
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం చిన్న కొమిర అంగన్వాడి సెంటర్ లో పోషకాహారం పై గర్భిణీలు, బాలింతలకు శుక్రవారం అవగాహన కల్పించారు. మునగాకు, మునగ పౌడర్లు ఉండే పోషక విలువలను అంగన్వాడి టీచర్ ఎ. ఉషారాణి వివరించారు. అనంతరం అంగన్వాడి ప్రాంగణంలో మునగ మొక్కలు నాటారు. అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్