తిరువూరులో అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.