తిరువూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం తిరువూరు పట్టణంలో మన ఊరు తిరువూరు అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ప్రజా సమస్యలను విన్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.