జాతీయ బాస్కెట్ బాల్ పోటీలకు అమల్ రెడ్డి ఎంపిక

63చూసినవారు
జాతీయ బాస్కెట్ బాల్ పోటీలకు అమల్ రెడ్డి ఎంపిక
విజయవాడ స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో 4సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ బాస్కెట్ బాల్ శిక్షకులు సంతోష్ కుమార్ వద్ద శిక్షణ పొందుతున్న అమల్ రెడ్డి జాతీయ బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికయినట్లు డీఎస్డీవో ఎస్ఏ అజీజ్ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. అమల్ రెడ్డి ఏప్రిల్ 27నుంచి 30వ తేదీ వరకు హర్యానాలో జరగనున్న 67వ జాతీయ బాస్కెట్బాల్ పోటీలలో పాల్గొంటాడని చెప్పారు

సంబంధిత పోస్ట్