ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను పాలనా సౌలభ్యం కోసం విరివిగా వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ అన్నారు. న్యూ ఢిల్లీలో గురువారం గూగుల్ కార్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై జరిగిన వర్క్ షాపులో ఆయన పాల్గొన్నారు. ఇటీవలే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీతో గూగుల్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.