పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై, బోయ కళ్యాణ్ రెడ్డి మృతికి కారణమైన అధ్యాపకులపై చట్టపరంగా చర్యలు తీసుకొని కళ్యాణ్ రెడ్డికి న్యాయం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాకి సోమవారం వినతిపత్రం సమర్పించారు. కళ్యాణ్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేసి, మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్, కళ్యాణ్ రెడ్డి మృతిపై చర్యలు చేపట్టాలన్నారు.