విజయవాడ: అమరావతి జపం తప్ప ప్రజా సమస్యలు పట్టవా

76చూసినవారు
విజయవాడ: అమరావతి జపం తప్ప ప్రజా సమస్యలు పట్టవా
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి జపం తప్ప ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టడం లేదని వైసీపీ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. శుక్రవారం అమరావతిలో రూ. 24, 276 కోట్ల విలువైన పనులకు కేబినెట్ ఆమోదం తెలపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పక్కనే కూతవేటు దూరంలో ఉన్న విజయవాడ నగరంలో అనేక సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నా ఇప్పటివరకు కనీసం రూ. వెయ్యి కోట్లు కేటాయించిన పాపాన పోలేదన్నారు.

సంబంధిత పోస్ట్