మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి కూటమి సర్కారు భయపడుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శనివారం ఘనంగా జరిగాయి. తొలుత డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.