రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవిన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాలను పరిష్కరించడంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ డివిజనల్ అధికారులు, మండల తహశీల్దార్లతో సమావేశమై, అధికారులు ఆచరణలోకి సంకల్పంతో అడుగులు వేయాలని, సదస్సుల లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరాన్ని సూచించారు.