రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచి పేదల నడ్డివిరుస్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. బుధవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గడిచిన 4 నెలలలో నిత్యావసరాలు మొదలుకొని ఆహారధాన్యాలు, అన్ని రకాల వస్తుసేవల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయని మండిపడ్డారు.