విజయవాడలో భారీ మోసం వెలుగు చూసింది. విజయవాడకు చెందిన నర్ర నాగశ్రీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనే మహిళకు డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల నుంచి శుక్రవారం ఫోన్ కాల్ వచ్చింది. దింతో భయపడిన ఆమె వెంటనే తన అకౌంట్లో నుంచి రూ. కోటీ పాతిక లక్షల పది వేల నగదును సైబర్ నేరగాళ్ల ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం ఇది మోసం అని తెలుసుకున్న ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.