వరద పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ కు వివరించిన సీఎం

85చూసినవారు
వరద పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ కు వివరించిన సీఎం
విజయవాడ నగరంలో బుడమేరు వల్ల సంభవించిన వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వరద పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస చర్యలను వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకురాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగమంతా రేయింబవళ్లు నిరంతరం పనిచేసి పెద్దఎత్తున సహాయ పునరావాస చర్యలు చేపట్టడం జరిగిందని గవర్నర్ కు వివరించారు.

సంబంధిత పోస్ట్