గ్రామీణ నీటి సరఫరా విభాగం మరియు పారిశుద్ధ్య నిర్వహణ శాఖ అధికారులతో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా తగు చర్యలు చేపట్టాలన్నారు.