విజయవాడ శివారులో పేకాట శిబిరంపై మంగళవారం కొత్తపేట పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఇన్నాయి. విజయవాడ రూరల్ మండలం నైనవరంలోని ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడిలో 12 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.82,290 నగదును స్వాధీనం చేసుకున్నట్లు కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. వీరందరిపై గేమింగ్ కింద కేసు నమోదు చేశామన్నారు.