రాష్ట్ర ప్రభుత్వం ముంపు ప్రభావిత బాధితులకు కుటుంబం యూనిట్‌గా ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని, కుటుంబంలో ఒకరిని గుర్తించి, వారి ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో డీబీటీ ద్వారా నగదు జమచేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన సోమవారం తెలిపారు. కుటుంబంలో మరోవ్యక్తిని లబ్ధిదారునిగా గుర్తించడానికి వీలు లేని విషయాన్ని గుర్తించాలన్నారు. అనవసరంగా అర్జీలు దాఖలు చేయొద్దని సూచించారు.