పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు: ఎమ్మెల్యే
ఆళ్లగడ్డ మండల గ్రామాలలో పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిలప్రియ హెచ్చరించారు. సోమవారం చాగలమర్రి మండలంలోని తోడేళ్లపల్లె మల్లె వేముల గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి వైద్యం అందుతుందా లేదా అనే వాటిపై అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సరఫరాలో కలుషితం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.