చిప్పగిరి మండల పరిధిలోని నెమకల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వాల్మీకి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహాకవి రామాయణాన్ని రచించి భారతీయులకు స్ఫూర్తి ప్రధానమైన జీవనాన్ని గడిపేందుకు దారి చూపారని ప్రధానోపాధ్యాయులు పెద్ద నాగన్న చిన్నారులకు వివరించారు.