ఇళ్ల నిర్మాణాలు డిసెంబర్ నాటికి పూర్తి చేసుకోవాలి

75చూసినవారు
ఇళ్ల నిర్మాణాలు డిసెంబర్ నాటికి పూర్తి చేసుకోవాలి
పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు డిసెంబర్ నాటికి పూర్తి చేసుకోవాలని కోడుమూరు ఎంపీడీవో చంద్రశేఖర్ లబ్ధిదారులకు సూచించారు. గురువారం ప్యాలకుర్తిలోని జగనన్న కాలనీని సిబ్బందితో కలిసి ఎంపీడీవో పరిశీలించి, మాట్లాడారు. వంద రోజుల్లోగా పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్, ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్