రిటైర్డు సహాయ బీసీ సంక్షేమాధికారి మృతి

77చూసినవారు
రిటైర్డు సహాయ బీసీ సంక్షేమాధికారి మృతి
కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బీసీ వసతి గృహ సంక్షేమాధికారిగా, పదోన్నతిపై సహాయ బీసీ సంక్షేమాధికారిగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విధులు నిర్వహించిన రాముడు ఆదివారం మృతి చెందారు. కృష్ణగిరి మండలం ఎరుకలచెర్వు గ్రామంలో జన్మించిన ఆయన సహాయ బీసీ సంక్షేమాధికారిగా 2011లో పదవీ విరమణ చేశారు. క్రమశిక్షణ కలిగిన వార్డెన్ గా ఆయన గుర్తింపు పొందారు. రాముడు మృతి పట్ల జిల్లాలో పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్