కర్నూలు పట్టణంలోని విఠల్ నగర్ లో ఉన్న గుడ్ షెఫర్డ్ క్రీడా ఆవరణలో.. గురువారం జిల్లా స్థాయి జూనియర్ షూటింగ్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా నలుమూల నుండి 350 క్రీడాకారులు హాజరుగా క్రీడాకారుల పరిచయ కార్యక్రమం అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడాకారులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. అలాంటి వారికి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని తెలిపారు.