ఆదోనిలో ఓ మోస్తారు వర్షం

74చూసినవారు
ఆదోనిలో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గత పది రోజుల నుండి వర్షాలు పడకపోవడంతో పత్తి, జొన్న, సజ్జ, మిరప, తదితర పంటలు వాడి మొఖం పట్టడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని, ఇదే వర్షం ముందు వచ్చి ఉంటే పంటలు బాగా ఉండేవని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్