పెద్దకడబూరు గ్రామంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో వద్ద డిప్యూటీ తహసీల్దార్ మహేష్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ జెండాను సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ మహేష్ ఆంగ్లేయులపై భారతీయుల పోరాటాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మహేష్, వీఆర్వోలు పాల్గొన్నారు.