శిథిలావస్థలో బీసీ హాస్టల్ గదులు!

62చూసినవారు
పెద్దకడబూరులోని బీసీ బాలురు వసతి గృహంలోని గదులు శిథిలావస్థకు చేరాయి. పైకప్పు పెచ్చులూడి ప్రమాదకర స్థాయిలో ఉంది. ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హాస్టల్లో స్నానపు గదులు, మరుగుదొడ్లు లేక ఆరుబయటకు వెళ్లే పరిస్థితి దాపురించిన విద్యార్థులు వాపోయారు.

సంబంధిత పోస్ట్