పెద్దకడబూరు మండలంలోని హెచ్ మురవణిలో ఎస్సీ రైతు మిత్ర గ్రూపు సభ్యులకు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ. 13. 50 లక్షలు విలువ చేసే వ్యవసాయ పనిముట్లను జాతీయ పరిశోధన సంస్థ సభ్యులు డాక్టర్ బాలకృష్ణన్, రమేష్ నాయక్, శ్రీధర్ ఏఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం పంపిణీ చేశారు. వ్యవసాయ పనిముట్లు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. వ్యవసాయ పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.