సోలార్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన

52చూసినవారు
సోలార్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన
ఓర్వకల్లు మండలంలోని ఉయ్యాలవాడ సమీపంలో స్థాపించనున్న సోలార్ పరిశ్రమకు వ్యతిరేకంగా బుధవారం కరపత్రాలను ఏపీ రైతు సంఘం భూనిర్వాసితుల కమిటీ సభ్యులు పంపిణీ చేశారు. రైతులకు నష్టం కల్గించే పరిశ్రమ స్థాపనను నిలిపేంత వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉయ్యాలవాడలో సోలార్ పరిశ్రమ నిర్మాణం చేపట్టబోమని టీడీపీ నాయకులు ఇచ్చిన హామీని విస్మరించారన్నారు.

సంబంధిత పోస్ట్