పత్తికొండ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు మూడురోజులకే అనుమతి ఉందని ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. బుధవారం డీఎస్పీ వెంకట్రామయ్యతో కలిసి పత్తికొండ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించి, మాట్లాడారు. ఉత్సవాలకు ఐదురోజులకు ఇవ్వాలని కోరగా, ఉన్నతాధికారులు మూడురోజులకే ఇచ్చారని తెలిపారు. ప్రతి మండపానికి వాట్సప్‌లో అనుమతి తీసుకోవాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.