పత్తికొండ పట్టణంలో దొంగతనాల నివారణకు సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ జయన్న గృహ నిర్మాణదారులను, వ్యాపారులను కోరారు. గురువారం ఆయన పత్తికొండలో మాట్లాడారు. దొంగతనాలను అరికట్టడంలో సీసీకెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయన్నారు. అయ్యప్పస్వామి కాంప్లెక్స్, టీచర్స్ కాలనీ, అంబేడ్కర్ సర్కిల్, మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో వ్యాపారులు, ఉద్యోగులు సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.