పత్తికొండ: పెళ్లిలో విషాదం.. గిఫ్ట్ ఇస్తూ యువకుడు మృతి
కృష్ణగిరి మండలం పెనుమాడలో గురువారం జరిగిన ఓ పెళ్లిలో విషాదం చోటు చేసుకుంది. మిత్రులతో కలిసి పెళ్లి జంటకు గిఫ్ట్ ఇచ్చే సమయంలో ఓ యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. బి. అగ్రహారంకు చెందిన వంశీకుమార్ (28) సాఫ్ట్ వేర్సాఫ్ట్వేర్ ఉద్యోగి, స్నేహితుడు రవికిరణ్ గౌడ్ పెళ్లికి వచ్చి, స్నేహితులతో కలిసి తలంబ్రాలు అయిన తరువాత తెచ్చిన గిఫ్ట్ ఇచ్చేందుకు వేదికపైకి వెళ్లిన సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు.