ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మండల ప్రత్యేక అధికారి ఆదిలక్ష్మి సూచించారు. శుక్రవారం ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె సందర్శించి వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అందుకు స్పందించిన ఆమె ఆసుపత్రి అభివృద్ధి నిధుల నుండి నిధులు మంజూరు చేశారు.