చేపల పెంపకం తోనే మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య లు చెప్పారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలోని సురసముద్రం చెరువులో వారు అధికారులతో కలిసి చేప పిల్లలను వదిలారు. అనంతరం మాట్లాడుతూ మత్స్యకారులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.