పెద్దకడుబూరు మండలం, కళ్లకుంటలో నిర్భంద దాడికి గురైన గోవిందమ్మను కెవిపియస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు, డివైఎఫ్ఐ నాయకులు నగేష్ తదితరులు పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అధికారులు విచక్షణ రహిత దాడిపై దర్యాప్తు చేయాలని, బాధితులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.