తాడుపై నడుస్తూ రెండు ఖండాల్ని దాటాడు (Video)
ఎస్టోనియా దేశస్థుడు జాన్ రూస్, అత్యంత కష్టమైన ఫీట్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ స్లాక్లైనర్ ఒక టైట్రోప్పై నడుస్తూ ఒక ఖండాన్ని దాటి మరో ఖండానికి చేరుకున్నాడు. జాన్ రూస్ నడిచిన టైట్రోప్ను ఇస్తాంబుల్‌లోని జులై 15 మార్టిర్స్ బ్రిడ్జ్ అమరవీరుల వంతెనపైన కట్టారు. రూస్ ఆసియా ఖండంలో తాడు పైన నడవడం మొదలుపెట్టి ఐరోపా ఖండానికి చేరుకున్నాడు. ఈ రోప్ బోస్ఫరస్ జలసంధి నుంచి 165 మీటర్ల ఎత్తులో ఉంది.