గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్లలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీకృష్ణుడి ఆలయం నుండి బీరప్ప ఆలయం వరకు శ్రీకృష్ణుడి విగ్రహంతో ఎద్దుల బండిపై శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడి వేషాధారణలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నారాయణ,నరసింహుడు మాట్లాడుతూ.. రాత్రి 10 గంటలకు భజన బృందంతో భజన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు.