ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామంలో ఆదివారం తిమ్మప్ప ఉత్సవాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఆధిపత్య పోరులో భాగంగా రెండు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడులలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కాగా స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొడవకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.