ఆదోని: రోడ్డు అన్యాక్రాంతంపై సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు

59చూసినవారు
ఆదోని: రోడ్డు అన్యాక్రాంతంపై సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు
ఆదోని పట్టణంలోని 2వ వార్డులోని చౌదరిబావికి పక్కనున్న 20 అడుగుల రోడ్డును ఆక్రమించుకొని వైసీపీ కౌన్సిలర్ గుడిసె వేశారని టీడీపీ మాజీ కౌన్సిలర్ తిమ్మప్ప ఆరోపించారు. సోమవారం ఆదోనిలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ను కలిసి తన సమస్యను వివరించి, ఫిర్యాదు చేశారు. రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోవడంలేదన్నారు.

సంబంధిత పోస్ట్