ఆదోని: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం

53చూసినవారు
ఆదోని: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం
ఆదోని పట్టణంలో కొందరు రేషన్ బియ్యాన్ని గోడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారం రావడంతో బుధవారం తాలుకా పోలీసులు దాడులు నిర్వహించారు. ఆదోని పట్టణంలోని స్థానిక ఆస్పరి రహదారిలోని మారెమ్మ దేవాలయం వెనుకల ఉన్న రేకుల షెడ్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 14 ప్యాకెట్ల బియ్యంతోపాటు రాజశేఖర్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నామన్నారు. రెవెన్యూ అధికారులకు అప్పజేబుతామని ఎస్సై రామాంజనేయులు తెలిపారు.

సంబంధిత పోస్ట్