అమరావతి సచివాలయం ఛాంబర్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసినట్లు ఆదోని ఇన్‌ఛార్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీనాక్షి నాయుడు బుధవారం చరవాణి ద్వారా ఆదోని విలేకరులకు తెలిపారు. ఆదోని నియోజకవర్గానికి గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు అమలు చేసి ఆదోనిని అభివృద్ధి పథంలో నడిపించాలని సీఎంను కోరామన్నారు. సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.