ఆదోని శివారులో శిథిలావస్థకు చేరిన ఇళ్లపై సీపీఐ నేతల వినతి

50చూసినవారు
ఆదోని శివారులో శిథిలావస్థకు చేరిన ఇళ్లపై సీపీఐ నేతల వినతి
ఆదోని పట్టణ శివారు సిరుగుప్ప క్రాస్ రోడ్ వద్ద 2005లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో 500కి పైగా గృహాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ఈ ఇళ్లను పునర్నిర్మించి లబ్ధిదారులకు అప్పగించాలనే డిమాండ్‌తో ఆదోని సీపీఐ నాయకులు అజయ్ బాబు ఆదోని సబ్ కలెక్టర్‌ కి  సోమవారం వినతిపత్రం అందజేశారు. అలాగే, ఆ గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్