రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్లో ఆప్షన్ ఓపెన్ చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తుతోపాటు పెన్షన్ ఐడీ, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ జిల్లా, మండలం, సచివాలయం పేర్లు ఇవ్వాల్సి ఉంటుందని, ఆధార్ జిరాక్స్ కూడా అందించాలి. దీంతో స్వగ్రామాలకు రాలేని వారు తాము ఉండే ప్రాంతంలోనే పొందవచ్చును.