ఆళ్లగడ్డ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

70చూసినవారు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మినుముల కట్టె కోసే మిషన్ బోల్తా పడడంతో కూలి పనికి వెళ్లిన బట్టు సుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మరోతో పాటు నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్