కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి చేరికలు

53చూసినవారు
కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి చేరికలు
ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం వైసీపీలో చేరారు. పుట్టాలమ్మ క్షేత్రం ఛైర్మన్ గంగుల మనోహర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ గంధం రాఘవరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన గంధం మల్లేశ్వరరెడ్డి, గంధం నాగిరెడ్డి తదితరులకు వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్