అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి హామీనిచ్చారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని రుద్రవరం మండలం ఆలమూరులో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా పంటలను పరిశీలించారు. అనంతరం నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంట నష్టాన్ని అంచనా వేయమని అధికారులను ఆదేశించినట్ల తెలిపారు.