కంటి సమస్యలను అశ్రద్ధ చేయరాదని ఆప్తాలమజిస్ట్ సులోచన తెలిపారు. చిప్పగిరి మండలంలోని నేమకల్ పాఠశాలలో బుధవారం ఆమె విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. పది అడుగుల దూరంలో అక్షరాలు చదివించి చూపు పరీక్షించారు. ఇబ్బంది కలిగిన విద్యార్థులకు అద్దాలు అవసరమని, ప్రభుత్వానికి నివేదిక పంపి అద్దాలు అందజేస్తామని చెప్పారు.