హాలహర్వి మండలంలోని అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తహశీల్దార్ నజ్మాబాను శనివారం తెలిపారు. ట్రాక్టర్ యజమానులతో మాట్లాడారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇళ్లకు, రోడ్లకు, డ్రెయినేజీ అవసరాలకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలన్నారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసులు నమోదు చేస్తామని చెప్పారు.