ఆలూరు: టీబీ డ్యాం గేట్లకు నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే

84చూసినవారు
ఆలూరు: టీబీ డ్యాం గేట్లకు నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే
తుంగభద్ర జలాశయం గేట్లు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ. 250 కోట్లు కేటాయించాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు. బుధవారం ఆలూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన మాట్లాడారు. మొత్తం గేట్లు మార్చాల్సి ఉందని, గేట్ల తయారీ నిపుణుడు కన్నయ్య నాయుడు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం రూ. 52 కోట్లు టీబీ డ్యాం మరమ్మతులకు విడుదల చేయడం సరికాదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్