కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. శనివారం ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ కుటుంబంతో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామస్థులు తానా భవనం నుంచి కళ్యాణమండపం వరకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కబడ్డీ, బ్యాడ్మింటన్, స్లోసైక్లింగ్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈగల్ ఐజీ మాట్లాడారు. పదేళ్ల క్రితం గ్రామంలో దయనీయంగా ఉన్న పరిస్థితులను మార్చి, అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు.