సీజనల్ వ్యాధులపై గర్భిణులకు అవగాహన

62చూసినవారు
సీజనల్ వ్యాధులపై గర్భిణులకు అవగాహన
దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కళ్యాణ్ ఆధ్వర్యంలో బుధవారం గర్భిణులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. మలేరియా, చికెన్ గున్యా, డెంగీ వంటి వ్యాధులు వర్షాకాలంలో సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. వాటిపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గర్భిణులు బిడ్డకు కావాల్సిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్