నిందితులను కఠినంగా శిక్షించాలి

83చూసినవారు
నిందితులను కఠినంగా శిక్షించాలి
పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో దళిత మహిళ గోవిందమ్మపై విచక్షణారహితంగా దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, ఎమ్మార్పీఎస్ నాయకులు యువరాజ్ డిమాండ్ చేశారు. శనివారం ఆదోని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతున్న గోవిందమ్మను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత గోవిందమ్మ దాడి వెనుక ఉన్న అగ్రవర్ణాల వారిని అరెస్టు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్